భారతదేశం, మే 3 -- Thimmarajupalli TV Villain Latheesh About His Career Struggles: తెలుగులో రూరల్ కామెడీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ చిత్రానికి మంచి విజయం దక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో నిర్మాతగా మారిన హీరో కిరణ్ అబ్బవరం దాదాపుగా 50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తెలుగు వెండితెరకు పరిచయం చేశారు.

ఈ సినిమాలో విలన్ పాత్రలో సిద్ధయ్యగా నటించిన యాక్టర్ లతీష్ మంచి పేరుని సంపాదించుకున్నారు. తనకు దక్కిన ఈ మొదటి విజయం గురించి చెబుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు. తిమ్మరాజుపల్లి టీవీ విలన్ పాత్ర చేసిన లతీష్ చెప్పిన విశేషాలపై లుక్కేద్దాం.

నగరిలో మాది వ్యవసాయ ఆధారిత నిరుపేద కుటుంబం. ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజులున్నాయి. మమ్మల్ని మా అమ్మనాన్న, అన్నయ్య కష్టపడి చదివించారు....