భారతదేశం, అక్టోబర్ 12 -- వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం (SDLCE/CDOE) ద్వారా జూలై 2026 విద్యా సంవత్సరానికిగాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దరఖాస్తు గడువును అక్టోబర్ 13వ తేదీతో ముగియనుంది. ఉన్నత చదువులు చదవాలనుకునే ఉద్యోగులు, విద్యార్థులకు ఇది మంచి అవకాశమని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, ఓరియంటేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. రేపు మాత్రమే మిగిలి ఉండటంతో ఆసక్తిగల వారు.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్ లేదా నేరుగా ఆఫ్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆసక్తి ఉన్నవారు కాకతీయ యూనివర్సి...