భారతదేశం, ఏప్రిల్ 3 -- వరంగల్ కాకతీయ యూనివర్శిటీ దూర విద్యలో ప్రవేశాలకు కొత్త నోటిఫికేషన్ (ఫిబ్రవరి సెషన్ - 2026) జారీ అయింది. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

నిర్ణయించిన దరఖాస్తు ఫీజు లేదా కోర్సు ఫీజును ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది. యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే స్టడీ సెంటర్ ను ఎంచుకోవాలి. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవచ్చు. కోర్సుల ఫీజు వివరాలను అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

కేయూ దూర విద్యలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కూడా వేర్వురు కాంబినేషన్లు ఉండటంతో. అభ్యర్థులు జాగ్...