భారతదేశం, అక్టోబర్ 29 -- తెలుగు రాష్ట్రాల్లోని యవతను, బైక్ రైడింగ్ క్రేజ్ ఉన్న కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్న పాపులర్ పర్ఫార్మెన్స్ బైక్ 'కేటీఎం 200 డ్యూక్' త్వరలోనే మరింత పవర్‌ఫుల్ అప్‌డేట్‌తో పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఆస్ట్రియన్ బైక్ తయారీ దిగ్గజం కేటీఎం.. తమ 200 డ్యూక్ మోడల్‌ను సరికొత్త టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు టీజ్ చేసింది. షోరూమ్‌లు, డీలర్‌షిప్‌లలో లీకైన పిక్చర్స్ ఆధారంగా, ఈ బైక్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా కస్టమర్లు కోరుకునే విప్లవాత్మక ఎలక్ట్రానిక్ ఫీచర్లను జోడించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో స్పోర్ట్స్ బైక్ ప్రియుల సంఖ్య నిరంతరం పెరుగుతున్న వేళ, రేసింగ్ అనుభూతిని సాధారణ రోడ్లపై అందించడానికి కేటీఎం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

పెద్ద బైక్స్ అయిన 250 డ్యూక్, 390 డ్యూక్ మోడళ్...