భారతదేశం, అక్టోబర్ 29 -- Kriti Sanon Obsession: హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అతి స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా వందల మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి సంచలనం సృష్టించిన చిత్రం 'అబ్సెషన్' (Obsession). కర్రీ బార్కర్ దర్శకత్వంలో ఇండే నవరెట్టే, మైఖేల్ జాన్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పుడు ఇండియన్ డిజిటల్ వీక్షకులను భయపెట్టేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ అన్‌కట్ ఒరిజినల్ సైకాలాజికల్ హారర్ చిత్రం అక్టోబర్ 30 సాయంత్రం 7 గంటల నుంచి జియోహాట్‌స్టార్ లోని ది పీకాక్ హబ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ మోస్ట్ అవేటెడ్ హారర్ థ్రిల్లర్ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను ప్రముఖ డిజిటల్ స్పాట్‌లైట్ హబ్ జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేయనుంది. విశేషమేమిటంటే, ఈ సినిమాలో కథానాయిక నిక్కీ (Nikki) పాత్రకు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, కథానాయకుడు బేర్ (Bear)...