భారతదేశం, జూలై 28 -- కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ నుంచి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే జలకళను సంతరించుకుంటున్నాయి. కర్ణాటకలోని ఎగువ ప్రాజెక్టులైన ఆలమట్టి, నారాయణపూర్ నుంచి గత మూడు నాలుగు రోజులుగా క్రిందికి నీటిని విడుదల చేస్తుండటంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది.

జూరాల జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. సోమవారం సాయంత్రానికి నీటి మట్టం 8.63 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 27 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది.

జూరాల ప్రాజెక్ట్ వెనుకజలాల (బ్యాక్ వాటర్) ఆధారంగా నిర్మించిన వివిధ ఎత్తిపోతల పథకాల్లో పంపింగ్ ప్రక్రియను సోమవారం ప్రారంభించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వ్య...