భారతదేశం, ఆగస్టు 25 -- Tammareddy Bharadwaja On Kotha Cinema Movie: సినిమా పట్టణంలోనే కాదు పల్లెపల్లెనా ఉంటుందని నిరూపిస్తూ కొత్త దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్‌తో స్థానికంగా రూపొందించిన మూవీ "కొత్త సినిమా". ఈ సినిమాతో వంద మంది న్యూ టాలెంట్ నటులు టాలీవుడ్‌కు పరిచయం కావడం విశేషం.

సురేష్, రాకేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి అజర్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్‌తో పాటు డైలాగ్స్, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

సోమవారం (ఆగస్ట్ 24) సాయంత్రం హైదరాబాద్‌లో ఈ సినిమా 'వై ఇన్ హైదరాబాద్ వై నాట్ ఇన్ అవర్ ప్లేస్' అనే పేరుతో ఈవెంట్ పలువురు దర్శక నిర్మాతలు అతిథులుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్...