భారతదేశం, ఆగస్టు 1 -- Korean Kanakaraju Trailer: విభిన్నమైన కాన్సెప్టులను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరికొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు'. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' చిత్రాలతో అలరించిన కామెడీ స్పెషలిస్ట్ మెర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ఆడియన్స్‌లో విశేషమైన ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం అధికారిక ట్రైలర్‌ను మేకర్స్ నేడు గ్రాండ్‌గా విడుదల చేశారు.

కొరియన్ కనకరాజు ట్రైలర్ ఆద్యంతం అవుట్ అండ్ అవుట్ వినోదం, యాక్షన్, హారర్ అంశాల కలబోతగా సాగింది. ఇందులో వరుణ్ తేజ్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తూ సర్ ప్రైజ్ చేశాడు

ట్రేడ్, ఫిల్మ్ అనలిటిక్స్ పరంగా పరిశీలిస్తే.. 'కొరియన్ కనకరాజు' చిత్రం ప్రామాణిక హారర్ కామెడీ ఫా...