భారతదేశం, జూలై 24 -- Korean Kanakaraju OTT: విలక్షణమైన కథాంశాలతో అలరించే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన మార్క్ కామెడీతో ఆకట్టుకునే మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు'. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ హారర్ కామెడీ డ్రామా.. విడుదలకు ముందే ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సుమారు రూ.38 కోట్ల అంచనా బడ్జెట్‌తో తెరకెక్కిన 'కొరియన్ కనకరాజు' సినిమాపై ఇండస్ట్రీలో మొదటినుంచీ మంచి క్రేజ్ ఉంది. ఫిల్మ్ నగర్ లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు ఊహించని ధరకు అమ్ముడయ్యాయి. డిజిటల్ (OTT), టీవీ శాటిలైట్, ఆడియో, హిందీ డబ్బింగ్ హక్కులు కలిపి ఏకంగా రూ.26 కోట్ల భారీ మొత్తాన్ని సాధించాయని టాక్.

అంటే కేవలం నాన్-థియేట్రికల్ డీల్స్ ద్వారానే నిర్మాతలు తమ బడ్జెట్‌లో దాదాపు 72 శాతం...