Konda Family vs MLAs : సీఎం రేవంత్‌పై కొండా సుస్మిత కామెంట్స్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీవ్ర ఆగ్రహం! చర్యలకు డిమాండ్
భారతదేశం, ఆగస్టు 21 -- మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు. గురువారం శాసనసభాపక్ష (సీఎల్పీ) కార్యాలయం వేదికగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు.
"తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదనడం సరికాదు," అని కొండా సురేఖ వైఖరిని ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి వెంటనే ఖండించాల్సిందని అభిప్రాయపడ్డారు. "కొండా సురేఖ గతంలోనూ నోరుజారి పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారు. కొండా కుటుంబం మాట్లాడే భాష ఎప్పుడూ పార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.