భారతదేశం, మార్చి 24 -- Kona Venkat: కోన వెంకట్ నిర్మించిన తాజా మూవీ బ్యాండ్‌మేళం. కోర్ట్ మూవీ పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ మూవీ మార్చి 26న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో తన మూవీ గురించి కోన ఓ రేంజ్ లో చెప్పాడు. ఈ సినిమా నచ్చకపోతే భవిష్యత్తులో తాను రాసే సినిమాలు చూడొద్దని అన్నాడు.

బ్యాండ్‌మేళం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కోన వెంకట్ మాట్లాడాడు. అందులో నానిలాగే అతడు కూడా సవాలు విసిరాడు. "నానిలాగే నేను కూడా చెప్తున్నా.. ఈ సినిమా తప్పక చూడండి. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను రాసిన సినిమా మీరు మళ్లీ చూడొద్దు. అలాగని రాయడం మానేయను. మీకు నచ్చినంత వరకూ రాస్తూనే ఉంటా. ఈ సినిమాపై అంత కాన్ఫిడెన్స్ నాకు. ఈ మాట వింటే చిరంజీవిగారికి కోపం రావచ్చు. పొద్దునే ఫోన్ చేసి అలా ఎందుకన్నావ్ అని అంటారు. ఎందుక...