భారతదేశం, ఆగస్టు 26 -- హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో వేగంగా వచ్చిన ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా. మరికొందరు గాయపడ్డారు.

ప్రాథమిక వివరాల ప్రకారం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ బస్సు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు వైపు వెళ్తుండగా దొరకుంట సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం జరిగింది. బస్సు ముందు భాగం కంటైనర్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా ధ్వంసమైంది. సీట్లలో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒకేసారి చెల్లాచెదురుగా పడిపోయారు.

ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురిలో ముగ్గురు పురుషులున్నారు. మృతదేహాలు బస్సు ...