భారతదేశం, ఏప్రిల్ 18 -- KKR vs GT : ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్​) పరాజయాల పరంపర కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో కేకేఆర్‌ను చిత్తు చేసింది. అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్‌కు ఇది ఆరో మ్యాచ్‌లో ఐదో ఓటమి! పంజాబ్ కింగ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో లభించిన ఒక్క పాయింటే ఇప్పటివరకు ఆ జట్టు ఖాతాలో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో -1.149 నెట్ రన్ రేట్‌తో కోల్‌కతా ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ జట్టుకు ఐపీఎల్​ 2026 ప్లేఆఫ్స్​ రేసు అత్యంత క్లిష్టంగా మారిందనే చెప్పుకోవాలి.

మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ఇలాంటి ప్రదర్శన చేయడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌ను ఆల్‌రౌండర్ ...