భారతదేశం, మార్చి 30 -- దొంగలు నగలను దోచుకున్నారనో, బ్యాంకు దొచుకున్నారనో, వాహనాలు దొంగలించారనో మీరు వినే ఉంటారు. కానీ దొంగలు 'చాక్లెట్ల'ను దొంగలించడాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? యూరోప్​లో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లును దొంగలు దోచుకున్నారు. సోషల్​ మీడియాలో ఇప్పుడు ఇది హాట్​ టాపిక్​గా మారింది. నెటిజన్లు విపరీతంగా ఫన్నీ మీమ్స్​ వేస్తున్నారు.

గత వారం ఇటలీలోని ఒక ప్రొడక్షన్ సైట్ నుంచి పోలాండ్‌కు బయలుదేరిన ఒక ట్రక్కు దారిలోనే అదృశ్యమైంది. అందులో సుమారు 4,13,793 క్రంచీ వేఫర్ చాక్లెట్లు ఉన్నాయి.

ఈ భారీ చోరీపై కిట్​క్యాట్​ తయారీ సంస్థ నెస్లే చాలా వ్యంగ్యంగా స్పందించింది:

మేము ఎప్పుడూ కిట్‌క్యాట్‌తో ఒక 'బ్రేక్' తీసుకోమని ప్రజలను ప్రోత్సహిస్తుంటాం. కానీ ఈ దొంగలు మా సందేశాన్ని మరీ సీరియస్‌గా ...