భారతదేశం, నవంబర్ 4 -- Tabu Nagarjuna: కొన్ని రోజులుగా ఊరిస్తూ వచ్చిన కింగ్ 100 మూవీ మేకర్స్ ఎట్టకేలకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇవాళ (నవంబర్ 4) టబు బర్త్ డే సందర్భంగా మూవీలోని ఆమె క్యారెక్టర్ ను పరిచయం చేశారు. ఈ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో వెంటనే వైరల్ గా మారింది.

నాగార్జు, టబు అంటే ఎవర్ గ్రీన్ క్లాసిక్ జోడీ. నిన్నే పెళ్లాడుతా సినిమాలో వీళ్ల పెయిర్, వీళ్ల మధ్య కెమిస్ట్రీకి ఆడియన్స్ జై కొట్టారు. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు మరోసారి కలిసి నటించడంతో కింగ్ 100 మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో మహంతి ఝాన్సీ రాణిగా టబు నటిస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.

నాగార్జు, టబు జంటగా నటిస్తున్నారంటే వీళ్ల మధ్య లవ్ సీన్లు ఉంటాయనే అంచనాలుంటాయి. కానీ కింగ్ 100 మూవీలో మాత్రం లవ్ కాదు వార్ అని మేకర్స్ ముందుగానే ఈ గ్లింప్స్ వీడియోలో క్లార...