భారతదేశం, ఆగస్టు 29 -- Nagarjuna King 100: అక్కినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సర్ ప్రైజ్ వచ్చేసింది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మైల్‌స్టోన్ 100వ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (ఆగస్టు 29) పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది.

అక్కినేని నాగార్జున 100వ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న 'కింగ్ 100' (King 100) అనే వర్కింగ్ టైటిల్‌నే మూవీకి పెట్టేశారు. తమిళ దర్శకుడు రా. కార్తీక్ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

తాజాగా విడుదలైన కింగ్ 100 ఫస్ట్ గ్లింప్స్‌లో నాగార్జున లుక్, రాయల్ మేకోవర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వయసు పెరుగుతున్న కొద్దీ మరిం...