భారతదేశం, ఆగస్టు 28 -- King 100: అక్కినేని అభిమానులకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ రెడీ అయిపోయింది. 'కింగ్' నాగార్జున కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ మూవీగా వస్తున్న 100వ సినిమా (KING100) టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్ సైలెంట్‌గా డ్రాప్ చేశారు మేకర్స్. రేపు ఉదయం 9 గంటలకు రాబోయే మెయిన్ టైటిల్ రివీల్ కోసం మైండ్ బ్లాకింగ్ విజువల్ గ్లింప్స్‌తో హడావుడి స్టార్ట్ చేశారు.

కింగ్ 100 మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన చిన్న టీజర్ గ్లింప్స్ చూస్తే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థమవుతోంది. దట్టమైన చీకట్లో ఒక కారు అత్యంత వేగంగా దూసుకెళ్లడం, దారిలో కోబ్రా (నాగుపాము) వార్నింగ్ సైన్ బోర్డ్ కనిపించడం ఆడియన్స్‌లో గూస్‌బంప్స్ పెంచేస్తోంది.

ఈ కోబ్రా సింబల్ కి టైటిల్‌కి ఉన్న లింక్ ఏంటనే దానిపై అప్పుడే సోషల్ మీడియాలో రకరకాల గెస్సింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇది పక్కా హై-వోల్టేజ్ యాక్...