భారతదేశం, ఏప్రిల్ 15 -- Kindest Rasis: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి స్వభావం వారి రాశి చక్రంపై ఆధారపడి ఉంటుంది. కొందరు కోపంగా ఉంటే, మరి కొందరు అత్యంత సున్నిత మనస్కులుగా ఉంటారు. అయితే, పన్నెండు రాశుల్లో నాలుగు రాశుల వారు మాత్రం పరోపకారానికి మారుపేరుగా నిలుస్తారు. వీరు తమ సౌకర్యాలను సైతం పక్కన పెట్టి ఎదుటివారికి అండగా నిలుస్తారు. కేవలం మాటలతోనే కాకుండా, చేతల్లోనూ మానవత్వాన్ని చాటుకునే ఆ రాశుల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడి ప్రభావం వల్ల వీరు అత్యంత సౌమ్యులుగా, భావోద్వేగభరితమైన వ్యక్తులుగా ఉంటారు. తమ కుటుంబ సభ్యులే కాకుండా, కష్టాల్లో ఉన్న అపరిచితులకు కూడా వీరు వెంటనే స్పందిస్తారు. తమ మనసులో ఎన్ని బాధలు ఉన్నా, ఇతరుల కన్నీళ్లను తుడవడంలో వీరు ముందుంటారు. కర్కాటక రాశి వారు ఎదుటివారి కష్టాన...