భారతదేశం, అక్టోబర్ 22 -- Killer Trailer: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన 'గుప్పెడంత మనసు' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు నటి జ్యోతి రాయ్. ఆ సీరియల్‌లో సంప్రదాయబద్ధమైన 'జగతి మేడం' పాత్రలో ఆమె చూపించిన నటన, హుందాతనం అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఆమె వెండితెరపై కంప్లీట్ మేకోవర్‌తో షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'కిల్లర్' (KilleR). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో జ్యోతి పూర్వాజ్ బోల్డ్ గా కనిపిస్తోంది. ఫైటింగ్ సీక్వెన్స్ కూడా అదరగొట్టింది.

ఈ 'కిల్లర్' చిత్రానికి మరో ప్రత్యేకత ఉంది. జ్యోతి పూర్వాజ్ భర్త, టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ పూర్వాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గతంలో...