భారతదేశం, జూలై 20 -- సైరోస్​ ఈవీ లాంచ్​తో మంచి జోరు మీదున్న దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ కియా మోటార్స్​.. ఇప్పుడు ఇండియాలో మరో మోడల్​ని లాంచ్​ చేసేందుకు శరవేగంగా ప్లాన్స్​ చేస్తోంది. గ్లోబల్ మార్కెట్లో మంచి విజయం సాధించిన తన ప్రీమియం ఎస్‌యూవీ 'కియా సోరెంటో'ను భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. 2026 దీపావళి పండుగ సీజన్ కానుకగా ఈ సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీని విక్రయానికి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడక ముందే, కొన్ని కియా డీలర్‌షిప్‌లు ఈ ఎస్​యూవీ కోసం ముందస్తు బుకింగ్స్‌ను కూడా స్వీకరించడం ప్రారంభించాయి.

లీకైన సమాచారం ప్రకారం.. సరికొత్త, 7 సీటర్ కియా సోరెంటో భారత మార్కెట్లో రెండు పవర్‌ట్రెయిన్ (ఇంజిన్) ఆప్షన్లతో లభించనుంది. ఇందులో ఒకటి 1.6 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కాగా, మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. అంతర్జాతీయ మోడల్‌ తరహ...