భారతదేశం, జూలై 26 -- భారతీయ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సంచలనం సృష్టించిన 'కియా సోనెట్' ఇప్పుడు మరింత కొత్తదనంతో కస్టమర్ల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఆటోమొబైల్ వర్గాల సమాచారం ప్రకారం.. సెకండ్ జెనరేషన్ కియా సోనెట్ ప్రస్తుతం భారత రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటోంది. అంతర్గతంగా క్యూవై2ఈ అనే కోడ్‌నేమ్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త మోడల్, 2027 చివరి నాటికి అధికారికంగా మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

డిజైన్, సాంకేతికత, భద్రతలో విప్లవాత్మక మార్పులతో రానున్న ఈ కార్ల లైనప్‌లోకి 2028 లేదా 2029 నాటికి సరికొత్త 'స్ట్రాంగ్ హైబ్రిడ్' ఇంజిన్ కూడా తోడవుతుందని తెలుస్తోంది. ముందరి భాగంలో హనీకాంబ్ ప్యాటర్న్‌తో కూడిన చిన్న ఫ్రంట్ గ్రిల్ ఉంది.

కొత్త కియా సోనెట్​లో బూమరాంగ్ ఆకారంలో ఉన్న ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, స్ప్లిట్-స్టైల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాం...