భారతదేశం, ఏప్రిల్ 1 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్​లో కియా సెల్టోస్ తన జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే 6 లక్షల విక్రయాల మైలురాయిని దాటడమే కాకుండా, భరత్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి సత్తా చాటింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో కంపెనీ సెల్టోస్ లైనప్‌లో మరో రెండు ప్రీమియం వేరియంట్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోందని సమాచారం అవే జీటీఎక్స్​ (ఓ), ఎక్స్​-లైన్​ (ఓ).

ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీటీఎక్స్​ (ఏ), ఎక్స్​-లైన్​ (ఏ) వేరియంట్లకు ఇవి మరింత అప్‌గ్రేడెడ్ వెర్షన్లుగా రానున్నాయి. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినప్పటికీ, భారత్​ ఎన్​సీఏపీ సేఫ్టీ టెస్ట్ పత్రాల్లో ఈ పేర్లు స్పష్టంగా కనిపించాయి.

బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీ కియా సెల్టోస్​ కొత్త వేరియంట్లలో గతంలో మిస్ అయిన కొన్ని హై-ఎండ్ ఫీచర్లను సంస్థ మళ్లీ తీసుకువస్తోంద...