భారతదేశం, సెప్టెంబర్ 4 -- సోరెంటో ఎస్‌యూవీ ఆవిష్కరణ వేదికగా కుటుంబ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ కియా. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన కారెన్స్, కారెన్స్ క్లావిస్ ఎంపీవీల్లో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ వేరియంట్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.

ఈ నిర్ణయంతో భారత సీఎన్జీ విభాగంలోకి కియా తొలిసారిగా అడుగుపెడుతోంది.

ఇంతకుముందు కొన్ని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో మాత్రమే సీఎన్జీ కిట్లను అమర్చేవారు. అయితే ఆఫ్టర్ మార్కెట్ లేదా డీలర్ స్థాయి ఫిట్టింగ్‌లతో పోలిస్తే, కంపెనీలోనే తయారుచేసే ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ వ్యవహార శైలి ముమ్మాటికీ నమ్మకమైనది. ఇంధన పైప్‌లైన్లు, సిస్టమ్ కాలిబ్రేషన్, సేఫ్టీ కంట్రోల్స్ అన్నీ ప్లాంట్ ఉత్పత్తి దశలోనే జరుగుతాయి కాబట్టి భద్రతకు ఏమాత్రం ఢోకా ఉండదు.

కియా కారెన్స్, కారెన్స్​ క్లావిస్​ ఎం...