భారతదేశం, సెప్టెంబర్ 28 -- Khushboo Patani Urges Girls To Use Air Pistol: దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, హాట్ బ్యూటీ దిశా పటానీ సోదరి, మాజీ భారత సైనిక అధికారిణి ఖుష్బూ పటానీ కీలక సూచన చేశారు.

ఇటీవల బిహార్‌లోని జముయీ జిల్లాలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానుష వేధింపుల ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, మహిళలు ఆత్మరక్షణ కోసం స్వయంగా రంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు. స్వీయ రక్షణ కోసం ప్రతీ అమ్మాయి 'ఎయిర్ పిస్టల్' వాడటం నేర్చుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో ఎవరి సహాయం కోసం ఎదురుచూడకుండా తమను తాము కాపాడుకోవాలని సలహా ఇచ్చారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేక వీడియోను పంచుకుంటూ, CO2 ఆధారంగా పనిచేసే ఎయిర్ పిస్టల్ ఎలా పనిచేస్తుందో ఖుష్బూ ప్రత్యక్షంగా చూపెట్టారు. సాధారణ తుపాకీలా కాకుండా, ఇందులో గన్‌పౌడర్ లేద...