భారతదేశం, సెప్టెంబర్ 12 -- Khairatabad Ganesh 2026 : భాగ్యనగరం వేదికగా ఏటా అత్యంత వైభవంగా జరిగే వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి ఏకంగా 69 అడుగుల భారీ ఎత్తుతో భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రతియేటా దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ఆకర్శించే ఈ విశిష్ట విగ్రహ తయారీ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వెల్లడించింది.

ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతిని 'శ్రీ పంచముఖ సంకటహర గణపతి' రూపంలో తీర్చిదిద్దారు. భక్తుల కష్టాలను తీర్చి, సమస్త విఘ్నాలను తొలగించే ఈ అవతారం సిద్ధం చేయడానికి కళాకారులు అహోరాత్రులు శ్రమించారు. ఈ భారీ విగ్రహ రూపుకల్పన వెనుక సుమారు 150 మంది నైపుణ్యం కలిగిన మూర్తి కళాకారుల అపార శ్రమ దాగి ఉంది. తెలంగాణతో పాటు పశ్చిమ ...