భారతదేశం, అక్టోబర్ 2 -- హైదరాబాద్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు బ్రేక్ పడింది. ఖైరతాబాద్ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై తుది తీర్పు వచ్చేంత వరకు ఆ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయబోమని హైకోర్టుకు వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం తరఫున నిలిచిన స్టాండింగ్ కౌన్సెల్ అవినాష్ దేశాయ్, ధర్మాసనానికి కమిషన్ స్పష్టమైన వైఖరిని తెలియజేశారు.

గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన విజయారెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని కోర్టు ముందుకు తీసుకొచ్చింది. ఖైరతాబాద్ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈసీఐని ఆదేశించాలంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పి. విజయారెడ్డి, బిఆర్‌ఎస్ ...