భారతదేశం, ఆగస్టు 10 -- సమగ్ర శిక్షా అభియాన్ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 736 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV) మంజూరైనట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ 736 పాఠశాలల్లో ఒక్క మెదక్ జిల్లాలోనే 26 కేజీబీవీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

తెలంగాణలో సర్వశిక్షా అభియాన్, సమగ్ర శిక్ష పథకాల నిధుల వినియోగంపై మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు రాతపూర్వక సమాధానమిచ్చారు.

కేజీబీవీలతో పాటు పాఠశాల విద్యకు సంబంధించిన పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి తెలిపారు. రాజ్యాంగం ప్రకారం విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ, మెజారిటీ పాఠశాలలు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా...