భారతదేశం, ఫిబ్రవరి 19 -- Ketu Transit: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా చాలా మార్పులను తీసుకొస్తుంది. ఒక్కోసారి శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేతువు నీడ గ్రహం. కేతువు కూడా కాలానుగుణంగా రాశులను మారుస్తూ ఉంటాడు.

ద్రిక్ పంచాంగం ప్రకారం, కేతువు ఏప్రిల్ 22, 2026 సోమవారం నాడు సాయంత్రం 4:49కి మఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. కేతువు మఖ నక్షత్రానికి అధిపతి. తన సొంత నక్షత్రంలోకి కేతువు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. కెరీర్‌లో కూడా మంచి మార్పులను చూస్తారు. మొత్తం మీద కొన్ని రాశుల వారికి దశ తిరగబోతుంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతార...