భారతదేశం, జూలై 7 -- కేరళలోని వయనాడ్‌ను భారీ వర్షాలు, కొండచరియల విపత్తు మరోసారి వణికించింది. మంగళవారం కురిసిన కుండపోత వానల ధాటికి వయనాడ్ పరిధిలోని మేప్పాడి సమీపంలో గల కల్లాడి వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. నిర్మాణంలో ఉన్న 'అనాక్కంపోయిల్ - కల్లాడి - మేప్పాడి' ట్విన్ టన్నెల్ (సొరంగ మార్గం) ప్రాజెక్ట్ ప్రవేశ ద్వారం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మరణించగా 30 మందికిపైగా మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. సహాయక చర్యల కొనసాగుతున్నాయి.

కోజికోడ్ - వయానాడ్ జిల్లాలను అనుసంధానించే ప్రతిష్టాత్మక సొరంగ మార్గ పనులు కల్లాడిలోని మీనాక్షి బ్రిడ్జ్ పరిసరాల్లో జరుగుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి వయానాడ్ ప్రాంతంలో అత్యంత భారీ వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్ట్ సైట్ వద్ద భారీగా పేరుకుపోయిన మట్టి,...