భారతదేశం, మే 14 -- కేరళ రాజకీయాల్లో గత పది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ను కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. మే 4న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇన్నాళ్లూ సందిగ్ధత నెలకొంది. గురువారం (మే 14) ఢిల్లీలో జరిగిన హైకమాండ్ సమావేశం తర్వాత సతీశన్ పేరును ఖరారు చేశారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా పూర్తయినప్పటికీ, కేరళ విషయంలో మాత్రం కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేసింది. ముఖ్యమంత్రి పీఠం కోసం ముగ్గురు ఉద్ధండ నేతల మధ్య గట్టి పోటీ నెలకొనడమే ఇందుకు ప్రధాన కారణం. వీడీ సతీశన్‌తో పాటు...