భారతదేశం, మార్చి 28 -- కేరళ రాజకీయాలపై ఎన్నో దశాబ్దాలుగా ఒక స్థిరమైన అభిప్రాయం ఉంది. ఏ ఒక్కరికీ వరుసగా అధికారం ఇవ్వకుండా అక్కడి ఓటరు రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికారాన్ని మార్చేస్తారు. వామపక్ష కూటమి, కాంగ్రెస్ కూటముల మధ్య అధికార మార్పిడి జరుగుతూ కేరళ రాష్ట్రం ప్రజాస్వామ్యానికి ప్రత్యేకతగా నిలిచింది. అయితే ప్రభుత్వ మార్పు సంప్రదాయానికి 2021లో అక్కడి ప్రజలు తెరదించారు! వామపక్ష కూటమి (ఎల్‌డీఎఫ్) వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు రాజకీయ వర్గాల ముందున్న ప్రశ్న ఒక్కటే.. ఈసారి ఎల్‌డీఎఫ్ ముచ్చట‌గా మూడోసారి అధికారంలోకి వస్తుందా..? లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ దానికి పగ్గాలేస్తుందా..?

జాతీయ స్థాయిలో 'ఇండియా' కూటమిలో ఒకటైన ఈ రెండు కూటములు కేరళలో మాత్రం ప్రత్యర్థులుగా తలపడుతుండడంతో దేశవ్యాప్తంగా రాష్ట్ర ఎ...