భారతదేశం, అక్టోబర్ 29 -- Keerthy Suresh: దక్షిణాది చిత్రసీమలో తనదైన నటన, పద్ధతిగల పాత్రలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న నటి కీర్తి సురేష్ (Keerthy Suresh). సాధారణంగా ప్రయాణాల్లో అభిమానులతో చాలా సరదాగా ముచ్చటించే ఈ బ్యూటీకి తాజాగా ఒక విమాన ప్రయాణంలో అనూహ్యమైన, తీవ్ర ఇబ్బందికరమైన ఘటన ఎదురైంది.

ఇటలీలోని మిలాన్ నగరం నుంచి ఇండియాకు తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ఒక తాగుబోతు అభిమాని చేసిన హంగామా వల్ల కీర్తి సురేష్ ఇబ్బంది పడాల్సి వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఈ చేదు అనుభవాన్ని బయటపెడుతూ అసలు ఏం జరిగిందో వివరంగా పంచుకున్నారు. సెలబ్రిటీలైనా సరే ప్రైవసీని గౌరవించాలని, అభిమానం పేరిట హద్దులు దాటితే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు.

కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీ తట్టిల్ (Antony Thattil...