భారతదేశం, ఆగస్టు 7 -- Keerthy Suresh: నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా 'ది ప్యారడైజ్'లో ఆఫర్లు లేకే మహానటి కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ చేస్తోందంటూ నెటిజన్లు పెట్టిన ఒక వైరల్ వీడియోపై కీర్తి సురేష్ సరదాగా ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తన కెరీర్‌పై నిరాధారమైన విమర్శలు చేస్తూ, నానిని కన్నడ నటుడిగా పేర్కొన్న ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోకి కీర్తి సురేష్ తమిళంలో కామెంట్ చేస్తూ ఇచ్చిన 'చిన్న కరెక్షన్' ఫ్యాన్స్‌ని విపరీతంగా అలరిస్తోంది.

సోషల్ మీడియాలో సెలబ్రిటీల కెరీర్‌పై రకరకాల రూమర్లు ప్రచారం అవ్వడం సాధారణమే. అయితే ఎలాంటి సీరియస్‌నెస్ లేకుండా, సరదా కామెడీ టైమింగ్‌తో రూమర్‌మొంగర్స్‌కి చెక్ పెట్టడం కీర్తి సురేష్‌కే చెల్లింది.

ఇటీవల 'ఫ్రంట్‌వుడ్స్ టీవీ' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక మహిళ వీడియో చేస్తూ.. కీర్తి సురేష్‌కి ప్ర...