భారతదేశం, మార్చి 16 -- పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న కన్నడ మూవీ 'కేడీ ది డెవిల్' నుంచి వచ్చిన కొత్త సాంగ్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. హిందీలో 'సర్కే చునార్ తేరి సర్కే' అని సాగుతున్న ఈ పాటలో లిరిక్స్, స్టెప్పులపై దారుణమైన విమర్శలు వస్తున్నాయి. పాటలో బూతులు ఉన్నాయని, డ్యాన్స్ అసభ్యకరంగా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు.

కేడీ ది డెవిల్ మూవీలో నుంచి రిలీజైన సర్కే చునార్ తేరి సర్కే సాంగ్ కాంట్రవర్సీకి దారితీసింది. ఇందులో నోరా ఫతేహి వల్గర్ డ్యాన్స్ మూవ్స్ ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ సాంగ్ లో సంజయ్ దత్ కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగు పాపులర్ సింగర్ మంగ్లీ ఈ పాట పాడింది.

సర్కే చునార్ తేరి సర్కే సాంగ్ లో నోరా ఫతేహి పైట జారుస్తూ డ్యాన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇదేం డ్యాన్స్, ఇంత నీచమా? అంటూ నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు....