భారతదేశం, ఏప్రిల్ 4 -- గజ్వేల్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో లేకపోవటంపై నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతో క్యాంప్ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కార్యాలయం గోడకు రేవంత్ ఫొటోను తగిలించారు.

ఈ క్రమంలోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. క్యాంప్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఫర్నీచర్, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు.ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే ఈ దాడి జరిగందని ఆరోపిస్తున్నారు.

ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ రావ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ముమ్మాటికీ ఇద...