భారతదేశం, సెప్టెంబర్ 6 -- Kayadu Lohar About Women Objectification: తెలుగులో కూడా హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది బ్యూటిఫుల్ కయాదు లోహర్. రీసెంట్‌గా వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతోంది ఈ ఫంకీ భామ. ఇటీవల దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ సినిమాలో అలరించిన కయాదు లోహర్ నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.

అయితే, తాజాగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'ఇమ్మోర్టల్' చిత్రం విడుదల తర్వాత హీరోయిన్ కయాదు లోహర్ ఇండస్ట్రీలోని ఒక సున్నితమైన అంశంపై నోరు విప్పారు.

ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో సినిమాల్లో మహిళలను కేవలం ఆకర్షణీయమైన వస్తువుగా (Objectification) చూపించడంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి. సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను చిత్రీకరించే తీరుపై కయాదు...