భారతదేశం, మార్చి 13 -- స‌న్‌రైజ‌ర్స్ ఓనర్ కావ్య మారన్ పై ఇండియన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. దేశద్రోహి, సిగ్గు లేదు అంటూ తీవ్రమైన మాటలతో రెచ్చిపోతున్నారు. ఐపీఎల్ 2026లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ మ్యాచ్ లను బాయ్ కాట్ చేస్తామంటున్నారు. దీనంతటికి కారణం.. ది హండ్రెడ్ లీగ్ లోని కావ్య మారన్ టీమ్ స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను తీసుకోవడమే.

ఇంగ్లాండ్ లో జరిగే ది హండ్రెడ్ క్రికెట్ లీగ్ లో కావ్య మారన్ కు స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ అనే టీమ్ ఉంది. రీసెంట్ గా జరిగిన ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కావ్య టీమ్ కొనుగోలు చేసింది. వేలంలో స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ ఓనర్ కావ్య మారన్, హెడ్ కోచ్ డానియల్ వెటోరీ పాల్గొన్నారు. అయితే పాకిస్థాన్ స్పిన్నర్ ను ఓ ఇండియన్ తన టీమ్ లోకి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్...