భారతదేశం, నవంబర్ 22 -- Kavya Anirudh Honeymoon: చెన్నైలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుపుకున్న కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ మరోసారి వార్తల్లో నిలిచారు. పెళ్లి వేడుకలు ముగిసిన వెంటనే ఈ నూతన దంపతులు అత్యంత విలాసవంతమైన హనీమూన్ ట్రిప్‌ కు వెళ్లినట్లు తెలుస్తోంది.

కొత్త జంట కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ తమ హనీమూన్ కు వెళ్లడానికి లగ్జరీ జెట్ ను వాడారని తెలిసింది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కు చెందిన విలాసవంతమైన ప్రైవేట్ జెట్‌ ఇదేనని టాక్. 'VT-SRH' రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఈ ప్రత్యేక విమానంలో కావ్య మారన్, అనిరుధ్ ప్రయాణిస్తున్నారన్న వార్త సినీ, క్రీడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కావ్య మారన్‌కు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఆ జట్టు పేరు కలిసొచ్చేలా ఉన్న '...