భారతదేశం, మార్చి 9 -- మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ నుంచి 5 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు సాంబశివరావు. 2013లో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామం.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కావూరి సాంబశివరావు మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మూడు సార్లు, ఏలూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికై సేవలు అందించారు. కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
కావూరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు. కావూరి సాంబశివరావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రాజకీయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.