భారతదేశం, మార్చి 11 -- కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కావూరి సాంబశివరావు (82) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కావూరి స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ హయాంలో ఆయన 5సార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. మచిలీపట్నం నుండి 3 సార్లు, ఏలూరు నుండి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు.

యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో కావూరి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ.. ప్రగతి ప్రగతి కన్స్ట్రక్షన్స్ స్థాపించారు. ఇందులో విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు దూరం అవ...