భారతదేశం, ఏప్రిల్ 25 -- మేడ్చల్‌ జిల్లాలోని మునిరాబాద్‌లో అధ్వయ కన్వెన్షన్‌ వేదికగా కొత్త రాజకీయ పార్టీని ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత ప్రకటిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి శ్రేణులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కవిత మద్దతుదారులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. సరిగా ఉదయం 10 గంటలకు పార్టీ పేరును ప్రకటిస్తారు, జెండా ఆవిష్కరిస్తారు. ఉద్యమకారులను పెద్ద సంఖ్యలోఈ సభకు ఆహ్వానించారు.

వరంగల్‌ కాకతీయ కళా తోరణం ఆకృతిలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పార్టీ పేరు ప్రకటన ఉంటుంది. అనంతరం పార్టీ జెండావిష్కరణ జరుగుతుంది. సభకు వచ్చే అతిథులకు 34 రకాల తెలంగాణ వంటకాలతో భోజనాలు ఉంటాయి.

కవిత రాజకీయ పార్టీ ప్రారంభోత్సవానికి ముందు, సైబరాబాద్ పోలీసులు మునిరాబాద్‌ ఏరియాలో రోజంతా భారీ ట్రాఫిక్ రద్దీ ఉంటుందని హెచ్చరిస్తూ ట్రాఫిక్ సలహా జారీ చేశారు. ఈ కా...