భారతదేశం, జూలై 26 -- Katrina Kaif In Spirit: రెబల్ స్టార్ ప్రభాస్, 'యాంగ్రీ యంగ్ డైరెక్టర్' సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్' (Spirit). దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే వార్తల తర్వాత, ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా నటిస్తుందనే ప్రచారం జోరందుకుంది.

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ లో కత్రినా కైఫ్ కీ రోల్ ప్లే చేస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బిడ్డను జన్మనిచ్చిన తర్వాత ఈ బాలీవుడ్ బ్యూటీ స్పిరిట్ మూవీతోనే కమ్ బ్యాక్ ఇవ్వబోతుందనే టాక్ వినిపించింది. అయితే ఇవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అని తెలిసింది.

ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో కత్రినా కైఫ్ నటిస్తోందంటూ వస్తున్న వార్తల...