భారతదేశం, నవంబర్ 18 -- జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద ఏరివేత కార్యకలాపాల్లో భాగంగా భద్రతా దళాలకు భారీ విజయం దక్కింది. లోయలో అత్యంత ప్రమాదకరమైన మోస్ట్ వాంటెడ్ స్థానిక ఉగ్రవాది, దక్షిణ కశ్మీర్‌లో చురుగ్గా ఉన్న చివరి స్థానిక కమాండర్‌గా భావిస్తున్న మహమ్మద్ లతీఫ్ భట్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. కుల్గాం జిల్లాలో బుధవారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో భట్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు.

తాజా పరిణామాలతో ఏడాది కాలంగా భద్రతా సంస్థలు సాగిస్తున్న సుదీర్ఘ వేటకు తెరపడింది.

కుల్గాం జిల్లాలోని జంగాల్‌గామ్ గ్రామంలో ఉగ్రవాది నక్కి ఉన్నాడన్న పక్కా సమాచారంతో బుధవారం ఉదయం నుంచే భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో 23 ఏళ్ల లతీఫ్ భట్ గ్రామంలోని ఒక మసీదు లోపల చిక్కుకున్నాడు. భద్రతా సిబ్బంది గ్రామాన్ని పూర్తిగా చుట్టుముట్టి, లొంగిపోవాలన...