భారతదేశం, మే 14 -- Karuppu Trisha: స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష కాంబినేషన్‌లో వస్తున్న 'కరుప్పు' చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బుధవారం రాత్రి నుంచి ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. మే 14న ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన షోలను రద్దు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ అనూహ్య పరిణామంతో థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

త్రిష, సూర్య జంటగా నటించిన కరుప్పు మూవీకి షాక్ తగిలింది. ఈ మూవీ ఇవాళ (మే 14) రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మార్నింగ్ 9 గంటలకు ప్రారంభం కావాల్సిన స్పెషల్ షోలు రద్దు అయ్యాయి. తెలుగులో దీన్ని వీరభద్రుడు టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.

ఈ ఆకస్మిక రద్దుపై నిర్మాత ఎస్.ఆర్. ప్రభు ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తప్పనిసరి పరిస్థితుల్...