భారతదేశం, జూన్ 8 -- Karuppu OTT: ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లో సూర్య, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'కరుప్పు' (Karuppu) మే 15న థియేటర్లలో రిలీజ్ అయింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ క్లియర్ చేయాల్సిన బకాయిలు ఉండటంతో ఈ సినిమాకి ఒక ముఖ్యమైన రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ మిస్ అయ్యాయి.

అయినా సరే బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. కానీ ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజులు కూడా గడవకముందే ఈ మూవీ డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఇంత త్వరగా ఓటీటీలోకి రావడం చూసి నెటిజన్లు సైతం అయోమయానికి గురవుతున్నారు. అసలు ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

కరుప్పు సినిమా జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిలీజ్ అయిన కేవలం 28 రోజులకే ఇది ఓటీటీలోకి వచ్చేస్తుండటం విశేషం...