భారతదేశం, మార్చి 13 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 13 ఎపిసోడ్ లో.. తాను దీప గురించి నిజం చెప్పినట్లు, జ్యోత్స్న దీపను షూట్ చేసినట్లు ఊహించుకున్న దశరథ నో అని గట్టిగా అరుస్తాడు. దీపను చంపేస్తానని దాసుతో జ్యోత్స్న చెప్పిన మాటలను దశరథ గుర్తు చేసుకుంటాడు. తొందరపడితే దీపను జ్యోత్స్న బతకనివ్వదని దశరథ అనుకుంటాడు.

నీ కోడలు నీతో అబద్ధం చెప్పిందని స్ఫష్టంగా అర్థమైంది. అందుకు నీ కొడుకు కూడా సపోర్ట్ చేశాడని నీకు తెలుసు. నిజాలు బయటపడాలంటే దీపనే అడగాలి అని కాంచనతో పారిజాతం అంటుంది. కానీ దశరథ ఏమో దీపను వెనకేసుకొస్తాడు. బావ, దీప అబద్ధం చెప్తున్నారని జ్యోత్స్న చెప్పింది. కానీ నేను నమ్మేలేదు. అయితే రిపోర్ట్స్ చూశాక మీపై నమ్మకం పోయిందని శివ నారాయణ అంటాడు.

తప్పు చేసింది దీప అని నువ్వు అంటున్నావు. కానీ అందుకు మూల కారణం కార్తీక్. కడుపులో బిడ్డకే సమస్య ...