భారతదేశం, మార్చి 31 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 31 ఎపిసోడ్ లో.. దీపను ప్రేమగా మనవరాలా అంటూ పారిజాతం మురిసిపోతుంది. కార్తీక్ ప్లాన్ ప్రకారమే దీపనే సొంత మనవరాలు అని పారిజాతానికి దాసు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఈ విషయాన్ని కార్తీక్ కు చెప్పకుండా పారు కవర్ చేస్తుంది. దీప నీకు మనవరాలు లాంటిది, ఎందుకు ఆడిపోసుకుంటావని నా అంతరాత్మ నన్ను తిట్టిందని పారు అంటుంది.

నా బంగారు తల్లి దీప కోసం వచ్చానని పారిజాతం ఎనలేని ప్రేమ కురిపిస్తుంది. శౌర్యను మరింత గట్టిగా హత్తుకుంటుంది. శౌర్య వదలమని గింజుకుంటుంది. ఇన్నాళ్లు నిజం తెలియక మిమ్మల్ని ఎంత దూరం పెట్టానని పారు అంటుంది. నేను బాగానే ఉన్నా. నువ్వు నా కూతురివి కాంచన. కార్తీక్ నా మనవడు. దీప నా మనవరాలు. శౌర్య నా ముని మనవరాలు అని పారు వరసలన్నీ చెప్పేస్తుంది.

ఫొటోలోని కుబేర వంక చూస్తూ అతని గురించి మా...