భారతదేశం, ఏప్రిల్ 29 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్నకు నెల రోజుల్లో పెళ్లి కాకపోతే, ఇంకెప్పటికీ కాదని పంతులు షాక్ ఇస్తాడు. మరోవైపు జ్యోత్స్నను సవతిని చేస్తావా? అని కార్తీక్ పై దీప మండిపడుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే ఏప్రిల్ 29 ఎపిసోడ్ లో చూసేయండి.

కార్తీక్, దీపతో పారిజాతం ఫోన్లో మాట్లాడుతుంది. జ్యోత్స్నకు బ్రేక్ వేయాలని చెప్తుంది. తనను ఇలాగే వదిలేస్తే తన కోరికలో కూడా న్యాయం ఉందని జనాలు అనుకుంటారంటావ్ అని పారుతో కార్తీక్ అంటాడు. జ్యోత్స్న మన దగ్గర ఆడుతున్న నాటకాన్ని అందరిలో బయటపెట్టాలి. అందుకు మన దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది. దీపకు ఓ మంచి చీర కొనమని పారుకు కార్తీక్ చెప్తాడు.

జ్యోత్స్న మనసులో ఏముందో తాతకు, అత్తకు తెలిస్తే ఏం చేస్తారని కార్తీక్ అడిగితే.. ఉతికి ఆరేస్తారు, నాలు...