భారతదేశం, ఏప్రిల్ 4 -- Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో మమ్మీ కేక్ కట్ చేస్తుందని, దాన్ని నా చేతులతో స్పెషల్‌గా రెడీ చేసినట్లు జ్యోత్స్న చెబుతుంది. దాంట్లో విషం కలిపినట్లుగా జ్యోత్స్న గుర్తు చేసుకుంటుంది. నా కూతురు మాటలు తేడాగా ఉన్నాయని కార్తీక్‌తో దాసు అంటాడు. కార్తీక్ టెన్షన్ పడుతుంటాడు. నువ్ టెన్షన్ పడటం చూస్తుంటే చాలా బాగుందని జ్యోత్స్న అనుకుంటుంది.

సుమిత్ర కేక్ కట్ చేస్తుంది. అంతా చప్పట్లు కొడతారు. కేక్ మొదటి పీస్‌ను జ్యోత్స్నకు సుమిత్ర పెట్టబోతుంటే.. చాలా టెన్షన్ పడుతుంది. సుమిత్ర ముందు దీపకు పెట్టు అని దశరథ్ అంటాడు. దాంతో కార్తీక్ టెన్షన్ పడతాడు. ఎక్సలెంట్ డాడీ నా మనసులో మాట చెప్పావని జ్యోత్స్న అంటుంది. వారిద్దరు నా కూతురు లాంటివారే. దీప నా పెద్ద కూతురు. ముందు దీపకే పెట్టని అని దశరథ్ అంటాడు....