భారతదేశం, ఆగస్టు 25 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. తన రూమ్ లో దుస్తులు ఇస్త్రీ చేసుకుంటున్న సూరజ్ దగ్గరకు వెళ్లి జ్యోత్స్న మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకుని ఇంతకంటే బెటర్ పనులు చేయొచ్చు. కాబోయే భార్యకు ఓ మెసేజ్ చేయొచ్చని జ్యోత్స్న అంటుంది.

కాబోయే మొగుడు పెళ్లాం ఏం మాట్లాడుకుంటారో తెలియదా? అని సూరజ్ ను జ్యోత్స్న అడుగుతుంది. నీకే తెలిసి ఉండాలి. అమ్మాయిల మైండ్ మెచ్యూర్డ్ గా ఉంటుందని సూరజ్ అంటాడు. సూరజ్ చేతిని జ్యోత్స్న పట్టుకొని ఫీల్ అవుతుంది. సూరజ్ కు ముద్దు పెట్టాలనుకుంటుంది. కానీ సూరజ్ దూరంగా జరుగుతాడు.

ఇది తప్పనిపించింది. ఇంకా పెళ్లి కాలేదు కదా. భార్య కావడానికి ఇంకా టైమ్ ఉందని సూరజ్ అంటాడు. ఇందుకే నువ్వంటే ఇష్టం. ఎదుటివాళ్లు ఇచ్చేది నువ్వు తీసుకోవు. నువ్వు తీసుకోవాలన్నదే నువ్వు తీసుకు...